శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి

‘ప్రజలను రక్షించే పోలీసులే రౌడీల చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరం. కింది స్థాయిలో పని చేసే పోలీసుల నైతిక స్థైర్యాన్ని ఇలాంటివి దెబ్బ తీస్తాయి’ అని తెదేపా రాష్ట్ర

Published : 10 Aug 2022 05:41 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: ‘ప్రజలను రక్షించే పోలీసులే రౌడీల చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరం. కింది స్థాయిలో పని చేసే పోలీసుల నైతిక స్థైర్యాన్ని ఇలాంటివి దెబ్బ తీస్తాయి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కర్నూలులో కానిస్టేబుల్‌ సురేంద్రను రౌడీలు హత్య చేయడంపై ట్విటర్‌ వేదికగా మంగళవారం స్పందించారు. ‘కర్తవ్య నిర్వహణలో పార్టీలకు అతీతంగా నిక్కచ్చిగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తే కింది స్థాయి వారికీ ధైర్యంగా ఉంటుంది. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం.. నాయకులకు కొమ్ముకాస్తే.. దాని దుష్ఫలితాలు అనుభవించేది కింది స్థాయి ఉద్యోగులే’ అని ట్వీట్‌ చేశారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయని బాధ్యత గల ప్రతిపక్షంగా మూడేళ్లుగా పోలీసుశాఖను హెచ్చరిస్తూనే ఉన్నాం. అధికార పార్టీ ఎజెండాను అమలు చేయడంలో పెట్టిన శ్రద్ధ, ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులపై పెట్టిన దృష్టి, సొంతశాఖపై, శాంతిభద్రతలపై పెడితే బాగుండేది. ఇకనైనా మీ కర్తవ్యాలను సరిగా నిర్వర్తించండి’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని