‘యంగ్‌ ఇండియాకి బోల్‌’ ద్వారా అధికార ప్రతినిధుల ఎంపిక

యువజన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులుగా పని చేయడానికి ఆసక్తి ఉన్న వారికి ఆగస్టు 9 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించే ‘యంగ్‌ ఇండియాకి బోల్‌’ కార్యక్రమం ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు

Published : 10 Aug 2022 05:47 IST

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: యువజన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులుగా పని చేయడానికి ఆసక్తి ఉన్న వారికి ఆగస్టు 9 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించే ‘యంగ్‌ ఇండియాకి బోల్‌’ కార్యక్రమం ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాంపల్లి చౌరస్తా నుంచి గాంధీభవన్‌ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. యువజన కాంగ్రెస్‌కు తెలంగాణలో అత్యధికంగా అధికార ప్రతినిధులు ఉన్నారన్నారు. ‘యూత్‌ జోడీ బజ్‌ జోడీ’ అనే కార్యక్రమంతో ప్రతి పోలింగ్‌ బూత్‌కు అయిదుగురిని నియమిస్తామని, ఆ స్థాయిలో అన్ని సమస్యలను వారే పరిష్కరిస్తారన్నారు. 34 నియోజకవర్గాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించామని చెప్పారు. రానున్న మునుగోడు ఉప ఎన్నికతో పాటు ఇకపై ప్రతి ఎన్నికలో యువజన కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందని శివసేనారెడ్డి తెలిపారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి మమత మాట్లాడుతూ.. తెలంగాణ యువత దేశం గొంతుకగా ఉందన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో యూత్‌ ప్రతినిధి పోటీలు ఉంటాయని అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. అధికార ప్రతినిధుల ఎంపిక కోసం వచ్చే నెల 15న గాంధీభవన్‌లో పోటీ నిర్వహిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని