ఉద్యోగ కల్పన దస్త్రంపైనే తొలి సంతకం: షర్మిల

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే ఫైలుపైనే సీఎంగా తొలి సంతకం చేస్తానని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కొడంగల్‌ మండలంలోని పెద్దనందిగామ క్రాస్‌ రోడ్డు నుంచి బుధవారం ఆమె రెండో రోజు

Published : 11 Aug 2022 06:11 IST

కొడంగల్‌, బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే ఫైలుపైనే సీఎంగా తొలి సంతకం చేస్తానని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కొడంగల్‌ మండలంలోని పెద్దనందిగామ క్రాస్‌ రోడ్డు నుంచి బుధవారం ఆమె రెండో రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడంగల్‌ మండలం పర్సాపూర్‌ గ్రామంలో వైఎస్‌ఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి హస్నాబాద్‌ గ్రామం మీదుగా బొంరాస్‌పేట మండలం దుద్యాల గ్రామంలోకి ప్రవేశించి ప్రజలతో ‘మాట ముచ్చట’ కార్యక్రమం నిర్వహించారు. పొలాల్లో పనులు చేసుకొంటున్న కూలీలను పలకరిస్తూ రాజన్న బిడ్డగా మీ కష్టాలు తీర్చేందుకు వచ్చానన్నారు. ప్రతి పేద మహిళకు సొంత ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు సున్నావడ్డీకే రుణాలు అందిస్తామని చెప్పారు. రాజన్నకాలంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరితే కేసీఆర్‌ పాలనలో ప్రతి ఇంటికి అప్పులు మిగిలాయని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు