భాజపా ఆరోపణలు బూటకం, చెత్త: నీతీశ్‌

దేశానికి తదుపరి ఉప రాష్ట్రపతి కావాలని తాను చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం వల్లే ఆర్జేడీతో చేతులు కలిపినట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్‌ మోదీ చేసిన ఆరోపణలను బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ బూటకం, చెత్త

Published : 12 Aug 2022 06:17 IST

సుశీల్‌ మోదీ ‘ఉప రాష్ట్రపతి’ వ్యాఖ్యలపై బిహార్‌ సీఎం

పట్నా, దిల్లీ, ముంబయి: దేశానికి తదుపరి ఉప రాష్ట్రపతి కావాలని తాను చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం వల్లే ఆర్జేడీతో చేతులు కలిపినట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్‌ మోదీ చేసిన ఆరోపణలను బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ బూటకం, చెత్త అంటూ కొట్టివేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘సుశీల్‌ మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదం. నేనెప్పుడూ అలా కోరుకోలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు రెండింటిలోనూ మేము (జేడీయూ) ఎన్‌డీఏ అభ్యర్థికే మద్దతిచ్చాం’ అని గుర్తు చేశారు. 

ఈడీ, సీబీఐ కార్యాలయాలు మా ఇంట్లో పెట్టుకోవచ్చు : తేజస్వి

కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఈడీ, సీబీఐలకు తాము భయపడబోమని, బిహార్‌లో శాంతియుత వాతావరణం ఉంటుందంటే ఆయా ఏజెన్సీల కార్యాలయాలకు తన ఇంటి ఆవరణలో చోటిస్తానని బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు