స్వాతంత్య్ర సంగ్రామాన్ని అవమానిస్తున్న ప్రధాని

ప్రధాని మోదీ, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని వక్రీకరిస్తూ... అవమానిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ‘ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర’లో భాగంగా భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి చేపట్టిన

Published : 15 Aug 2022 05:39 IST

ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో భట్టి

పెనుబల్లి, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని వక్రీకరిస్తూ... అవమానిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ‘ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర’లో భాగంగా భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి చేపట్టిన పాదయాత్ర వీఎం బంజరలో ఆదివారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ నవభారత నిర్మాత నెహ్రూ చరిత్రపై మసిపూసి బురదజల్లే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు. నియంతలా పాలించే మోదీకి, సమష్టి నిర్ణయాలతో పరిపాలన చేసిన నెహ్రూ చరిత్ర ఏం తెలుస్తుందన్నారు. జాతీయవాదం ముసుగులో దేశాన్ని అమ్ముతున్న మోదీ నుంచి భారత్‌ను కాపాడమే కాంగ్రెస్‌ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. 50 ఏళ్ల వరకు జాతీయజెండా ఎగరేయని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు ‘ఆజాదీ కా అమృత్‌’  ఉత్సవాలు నిర్వహిస్తూ తామే దేశభక్తులమని చాటుకోవడం సిగ్గుచేటని రాజ్యసభ మాజీ సభ్యులు వి.హనుమంతరావు ఎద్దేవాచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని