సీఎం ఇలాకాలో ఇన్ని ఆత్మహత్యలా?

బటన్‌ నొక్కడం ద్వారా ప్రజలంతా బాగుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల

Published : 19 Aug 2022 05:15 IST

జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్‌

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, సిద్దవటం: బటన్‌ నొక్కడం ద్వారా ప్రజలంతా బాగుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. ఎక్కడా లేనంతగా వైయస్‌ఆర్‌ జిల్లాలోనే 175 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడడం దారుణమన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కరోనా పేరుతో సమాచారం బయటకు పొక్కకుండా దాచిపెట్టారని విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా సిద్దవటంలో శనివారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన ఏర్పాట్లను మనోహర్‌ గురువారం పరిశీలించారు. అనంతరం కడపలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున రూ.లక్ష వంతున సాయాన్ని పవన్‌ అందజేస్తారని వివరించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా రైతు భరోసాకు పవన్‌ శ్రీకారం చుట్టడంతోపాటు రూ.5 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారని అన్నారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్రంలో 600 మంది బాధితులుంటారని భావించగా.. ఇప్పటివరకు 2,900 మంది వరకు గుర్తించామని వివరించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలోనే అత్యధికంగా, అందులోనూ పులివెందులలోనే 46 మంది వరకు ఉన్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని