Gouthu Sireesha: పశువుల శాఖ మంత్రిని ఏమనాలి?: గౌతు శిరీష

మంత్రి సీదిరి అప్పలరాజు.. మచ్చలేని పాలన అందించిన తన నాన్న గౌతు శివాజీ, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తన తాత సర్దార్‌ గౌతు లచ్చన్నలపై తప్పుడుగా మాట్లాడాకే ఆయన్ను

Published : 22 Aug 2022 07:55 IST

పలాస, న్యూస్‌టుడే: మంత్రి సీదిరి అప్పలరాజు.. మచ్చలేని పాలన అందించిన తన నాన్న గౌతు శివాజీ, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తన తాత సర్దార్‌ గౌతు లచ్చన్నలపై తప్పుడుగా మాట్లాడాకే ఆయన్ను తాను పశువుల మంత్రిగా వ్యాఖ్యానించానని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. పశువుల శాఖ మంత్రిని పశువుల మంత్రి అనాలా.. లేక హోం మంత్రి అని పిలవాలా అని ప్రశ్నించారు. 60 ఏళ్ల చరిత్రలో గౌతు కుటుంబం ఏం చేసిందంటున్నారని, మీరు తిరుగుతున్న రోడ్లు తెదేపా హయాంలో వేసినవేనని శిరీష పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని