తెదేపా ఏకగ్రీవం చేసుకోవడం సహించలేకే.. కొవ్వూరు అర్బన్‌ బ్యాంకు ఎన్నికల రద్దు

వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికలను రద్దు చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Published : 27 Aug 2022 04:43 IST

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికలను రద్దు చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తెదేపా ఏకగ్రీవం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక, ఎన్నికలను రద్దుచేసి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్నికలను రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన 11 మంది అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్లలను, తెదేపా ద్విసభ్య కమిటీ సభ్యులను, తెదేపా నాయకులను అరెస్టు చేయడం దారుణం. ఎన్నికలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను చూపించకుండా వైకాపా వాళ్లు త్రిసభ్య కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారు. కుప్పంలో ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌ మీద దాడి చేయడం రాష్ట్రంలో పెరిగిపోతున్న అరాచకవాదానికి నిదర్శనం’’ అని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని