మునుగోడులో సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి

పథకాల పేరుతో తెరాస రాష్ట్రంలోని అన్ని వర్గాల గొంతులు నొక్కేస్తోందని పలు పార్టీలు, సంఘాల నేతలు విమర్శించారు. ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలను పట్టించుకోకుండా

Published : 25 Sep 2022 04:11 IST

వివిధ పార్టీలు, సంఘాల ఐక్య వేదిక నిర్ణయం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: పథకాల పేరుతో తెరాస రాష్ట్రంలోని అన్ని వర్గాల గొంతులు నొక్కేస్తోందని పలు పార్టీలు, సంఘాల నేతలు విమర్శించారు. ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలను పట్టించుకోకుండా ఓట్ల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పార్టీలకు అతీతంగా మునుగోడులో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరం, భారతీయ ఎంబీసీ ఆందోళన్‌ మంచ్‌, తెలంగాణ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం, బీసీ కులాల ఐక్య వేదిక సంయుక్తంగా శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ‘త్యాగాల తెలంగాణలో ఒక కుటుంబం భోగాలు - భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ.. ప్రజా సంఘాలు రాజకీయ శక్తిగా మారకుండా అధికారం సాధించలేవన్నారు. తెలంగాణ లారీ యజమానుల సంఘం నేత రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. లారీలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న పన్నునే చిన్న జిల్లాల్లోనూ వర్తింపజేస్తూ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. దీనిపై నిరసనను తెలుపుతూ మునుగోడులో 101 మందితో నామినేషన్లు వేయిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ నేత భావనారెడ్డి, వివిధ సంఘాల నేతలు కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, సీనియర్‌ పాత్రికేయులు పల్లె రవికుమార్‌, తెజస ఉపాధ్యక్షులు గంగపురం వెంకట్‌రెడ్డి, భాజపా నేత కాటం నర్సింహ్మ యాదవ్‌, జై స్వరాజ్‌ పార్టీ నేత కాసాని శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని