నేడు రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష(సీఎల్‌పీ) సమావేశం ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరగనుంది. దీనికి కాంగ్రెస్‌ పరిశీలకులుగా సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాజస్థాన్‌ వ్యవహారాల

Published : 25 Sep 2022 04:11 IST

తదుపరి సీఎం ఎంపిక కోసమేనా?

జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష(సీఎల్‌పీ) సమావేశం ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరగనుంది. దీనికి కాంగ్రెస్‌ పరిశీలకులుగా సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాజస్థాన్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్‌ మాకన్‌ హాజరవుతారు. రాష్ట్రంలో వారం రోజుల్లో జరుగుతున్న రెండో సీఎల్పీ సమావేశం(ఈ నెల 20న తొలి సమావేశం జరిగింది) ఇది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీచేస్తానని గహ్లోత్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవేళ తాను పార్టీ అధ్యక్షుడైనా.. ముఖ్యమంత్రి పదవిలోనూ కొనసాగుతానని, లేదంటే ఆ పదవిని తనకు నమ్మకస్తుడైన అనుచరుడికి ఇవ్వాలని గహ్లోత్‌ పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ యువనేత సచిన్‌పైలట్‌ వైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని