కాంగ్రెస్‌, భాజపాలకు ఓట్లడిగే హక్కు లేదు: జగదీశ్‌రెడ్డి

కాంగ్రెస్‌, భాజపాలు మునుగోడు ప్రజలకు ద్రోహం చేశాయని, వాటికి ఓట్లు అడిగే హక్కే లేదని విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం

Published : 26 Sep 2022 04:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌, భాజపాలు మునుగోడు ప్రజలకు ద్రోహం చేశాయని, వాటికి ఓట్లు అడిగే హక్కే లేదని విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా మునుగోడు ప్రగతి దెబ్బతిందన్నారు. అదే వ్యక్తిని రంగంలోకి దించడం ద్వారా నియోజకవర్గాన్ని మరింత నష్టపరిచేందుకు భాజపా సిద్ధమైందని మంత్రి విమర్శించారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థికే పట్టం కట్టడం ఖాయమన్నారు. మునుగోడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇప్పర్తి పాడి ఉత్పత్తిదారుల సొసైటీ ఛైర్మన్‌ చీమల వరుణ్‌యాదవ్‌, పంచాయతీ మాజీ సభ్యుడు ఈరటి శ్రీశైలం తదితరులు హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని