రాజధాని రైతులను రోడ్డున పడేశారు: సోము వీర్రాజు

రాష్ట్రంలో బియ్యం, ఇసుక, భూమి, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, వనరులున్నా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.

Published : 27 Sep 2022 04:57 IST

వినుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బియ్యం, ఇసుక, భూమి, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, వనరులున్నా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజాపోరు యాత్ర పేరుతో ఏర్పాటు చేసిన వీధి సమావేశాలలో పాల్గొన్నారు. అంతకు ముందు ఓ ప్రైవేటు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగనన్న రూ.25 మద్యం సీసాను అధిక ధరకు అమ్మి ఆ నగదుతో బటన్‌ నొక్కి మేకప్‌ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని