ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి నాపై చేయిచేసుకున్నారు

ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తనపై చేయిచేసుకున్నట్లు తెదేపా కార్యకర్త ఒకరు వెల్లడించారు.

Published : 03 Oct 2022 03:08 IST

తెదేపా కార్యకర్త వెల్లడి

గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తనపై చేయిచేసుకున్నట్లు తెదేపా కార్యకర్త ఒకరు వెల్లడించారు. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామంలో కాపు రామచంద్రారెడ్డి.. స్థానిక నేతలు, అధికారులతో కలసి ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో తెదేపా కార్యకర్త బెస్త మూర్తి ఇంటి వద్దకువెళ్లారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందారా? అంటూ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాల బిల్లులు మంజూరు కాలేదని, మూడేళ్లు కావస్తున్నా న్యాయం చేయలేదని మూర్తి నిలదీశారు. గత తెదేపా ప్రభుత్వ నిర్వాకం, కాలవ శ్రీనివాసులువంటి నాయకుల వల్లే బిల్లులు మంజూరు కాలేదని కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెస్త మూర్తిని వీపుపై కొట్టారు. స్థానిక వైకాపా నాయకులు సైతం అంతు చూస్తామంటూ బెదిరించారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ సునీత.. మూర్తి సెల్‌ఫోన్‌ను లాక్కుని అరెస్టు చేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వారందరి సెల్‌ఫోన్లను పోలీసులు లాగేసుకున్నారు. కాపు రామచంద్రారెడ్డి నుంచి బెస్త మూర్తికి ప్రాణహాని ఉందని తెదేపా నేతలు రాయదుర్గం గ్రామీణ సీఐకి ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని