YSRCP: ఫ్యాను గుర్తుకు ఓటెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయి: వైకాపా ఎమ్మెల్యే

‘‘ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలి.. వెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయ’’ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి, శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

Updated : 07 Oct 2022 07:17 IST

అన్నవరం, న్యూస్‌టుడే: ‘‘ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలి.. వెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయ’’ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి, శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అన్నవరంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ లో ఆయన గురువారం పాల్గొన్నారు. పలువురి ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వం అందించిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. మీకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు వంటివన్నీ జగన్‌ ప్రభుత్వంలో వైఎస్‌ఆర్‌ పార్టీ ఇచ్చిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని