అది.. తెదేపా ముసుగులో సాగుతున్న పాదయాత్ర

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర తెదేపా ముసుగులో సాగుతోందని, ఎక్కడికక్కడ తెదేపా ఆధ్వర్యంలో రైతులకు స్వాగతాలు పలుకుతున్నారని, అది ప్రజల మద్దతుతో కాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు.

Published : 08 Oct 2022 04:17 IST

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర తెదేపా ముసుగులో సాగుతోందని, ఎక్కడికక్కడ తెదేపా ఆధ్వర్యంలో రైతులకు స్వాగతాలు పలుకుతున్నారని, అది ప్రజల మద్దతుతో కాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన విశాఖలో విలేకర్లతో మాట్లాడారు. మహిళలు తప్ప పురుషులు ఈ యాత్రలో పాల్గొనడం లేదని, దీని ద్వారా వారి అసలు రూపం తేటతెల్లం అవుతోందన్నారు.  అన్ని పార్టీలు రైతుల పాదయాత్రకు మద్దతు ఇచ్చినప్పటికీ, సింహం మాదిరి జగన్‌ సింగిల్‌గా వచ్చి ప్రజల మనస్సులను గెలుచుకుంటారని చెప్పారు. పాదయాత్రను ఈ ప్రాంత ప్రజలు అంగీకరించడం లేదని, అందుకే పూజలు, కొవ్వొత్తుల ర్యాలీలు వంటివి నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌తో నష్టమేమీ లేదు
కేసీఆర్‌ తాత వచ్చినా తమకు నష్టమేమీ లేదని బీఆర్‌ఎస్‌ పార్టీపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో 40 టన్నుల మేర ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని మంత్రి కారుమూరి వెల్లడించారు. ఆరు జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ఎవరికీ బకాయిలు లేవన్నారు.  రైతులు ఆర్‌బీకేల వద్దకు ధాన్యం తీసుకొచ్చి అప్పగించాలని, అక్కడకు వచ్చి మిల్లర్లు కొనుగోలు చేస్తారన్నారు. తూకాల్లో మోసాలు, అధిక ధరలకు సంబంధించి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 579 కేసులు పెట్టామని చెప్పారు. కందిపప్పు అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని