Kodali Nani: రైతుల పాదయాత్ర కాదు.. అది తెదేపా యాత్ర: కొడాలి నాని
అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారు చేస్తున్నది రైతుల మహా పాదయాత్ర కాదని.. ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న మహా దండయాత్ర అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యా నించారు.గుడివాడలో నిర్వహించిన ‘గడప గడప’ కార్యక్రమంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
గుడివాడ (నెహ్రూచౌక్), న్యూస్‌టుడే: అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారు చేస్తున్నది రైతుల మహా పాదయాత్ర కాదని.. ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న మహా దండయాత్ర అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యా నించారు.గుడివాడలో నిర్వహించిన ‘గడప గడప’ కార్యక్రమంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గుడివాడ వచ్చి నన్ను ఓడిస్తానని చెప్పిన ప్రతి తెదేపా నాయకుడూ 2019లో పరాజయం పాలయినవారేనన్నారు. చిల్లర డబ్బుల కోసం ఆశ పడిన జనసేన, సీపీఐ, సీపీఎం, భాజపాలు పది జెండాలు పట్టుకొని యాత్రకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు.
పవన్ సీనియర్ రాజకీయవేత్త!: ‘పవన్ కల్యాణ్ గొప్ప నటుడు, సీనియర్ రాజకీయవేత్త. ఆయనకు చిరంజీవి మద్దతు అవసరం లేదు. మద్దతు తీసుకునే స్థాయిలో పవన్ లేడు’ అని నాని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించారు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అయితే ఆ పార్టీకి ఎంత వరకు మద్దతు లభిస్తుందో కాలమే చెప్పాలని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్