YS Sharmila: ‘నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు’ బూటకం: షర్మిల

నలుగురు శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారం ఓ బూటకమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Updated : 17 Nov 2022 08:05 IST

మానకొండూర్‌, న్యూస్‌టుడే: నలుగురు శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారం ఓ బూటకమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌కు చేరింది. ఇక్కడ సభలో షర్మిల మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో నాలుగు స్తంభాలాట అనే సినిమాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్‌ మాటలను ఎవరూ నమ్మడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాలకిషన్‌ కనిపించడం లేదని, దీన్ని పోలీసులు గమనించాలని కోరారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.లక్ష ఉండగా, ప్రస్తుతం రూ.వందల కోట్లు ఎలా వచ్చాయని షర్మిల ప్రశ్నించారు. ఎంపీ సంజయ్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి పనులు చేపట్టలేదని, కనీసం పర్యటించిన దాఖలాలు లేవని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని