చేతనైతే ‘జాకీ’ని వెనక్కి తీసుకురండి

చేతనైతే జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌ హెచ్చరించారు.

Published : 26 Nov 2022 04:56 IST

రాప్తాడు ఎమ్మెల్యేపై సుమోటో కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సీపీఐ నేతల ఫిర్యాదు

అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: చేతనైతే జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌ హెచ్చరించారు. ఆయన, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్‌, ఇతర నాయకులతో కలిసి శుక్రవారం అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై సుమోటో కేసు నమోదు చేయాలని కోరుతూ అనంతపురం డీఎస్పీ ప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జాకీ పరిశ్రమ ఏర్పాటయ్యే సందర్భంలో రాప్తాడు ఎమ్మెల్యే రూ.10కోట్లు ఇవ్వాలంటూ తన అనుచరుల చేత దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడటంతో అది వెనక్కి పోయింది. దీనిపై కథనం రావడంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాకీ స్థలాన్ని సందర్శించారు. దాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే, ఆయన సోదరుడు విమర్శలు చేయడం సరికాదు’ అని జగదీష్‌ అన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని