గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ నేడే

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Updated : 01 Dec 2022 03:42 IST

89 స్థానాల్లో 788 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుంది. 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశిస్తారు. రాష్ట్రంలో అర్హులైన మొత్తం ఓటర్లు 4.91 కోట్లు కాగా తొలి విడతలో 2.39 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణంగా భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ఉండే ఎన్నికల పోరు ఈ సారి ఆప్‌ రంగ ప్రవేశంతో త్రిముఖ పోటీగా మారింది. 2017లో తొలి దశలో పోలింగ్‌ జరిగిన 89 స్థానాల్లో భాజపా-48, కాంగ్రెస్‌-40 సీట్లను గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు