రాయలసీమ ద్రోహుల బూటకపు మాటలతో మళ్లీ మోసపోం

రాయలసీమ గర్జన పేరుతో ఏర్పాటు చేసిన సభలో రాయలసీమ ద్రోహుల బూటకపు మాటలు సీమవాసులు నమ్మరని భాజపా రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

Published : 07 Dec 2022 03:58 IST

భాజపా రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: రాయలసీమ గర్జన పేరుతో ఏర్పాటు చేసిన సభలో రాయలసీమ ద్రోహుల బూటకపు మాటలు సీమవాసులు నమ్మరని భాజపా రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కర్నూలులోని బైరెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ‘శ్రీబాగ్‌ ఒప్పందంలో ఏమి ఉందో అవగాహన లేని వారు బూటకపు మాటలతో సీమకు మళ్లీ అన్యాయం చేస్తున్నారు. ఆ ఒప్పందం ప్రకారం కర్నూలు వాసులు ఏం కోరితే అది ఇవ్వాలని ఉంది. కర్నూలులో హైకోర్టు కంటే పరిపాలనా రాజధాని ఇవ్వాలని’ ఆయన డిమాండ్‌ చేశారు. నాడు తొలి స్వాతంత్య్ర దినోత్సవానికి ఎస్టీబీసీ కళాశాల మైదానం వేదికైందని... నేడు అక్కడ రాయలసీమ గర్జన అనే కార్యక్రమం పెట్టి కలుషితం చేశారన్నారు. బుధవారం ఉదయం ఆ ప్రాంతాన్ని  పాలతో కడిగి పవిత్రం చేస్తామని వెల్లడించారు. బస్సుల్లో విద్యార్థులను ఎలా తరలిస్తారని, ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. త్వరలో రాయలసీమ మేధావులతో కలిసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు