సొంత సామాజికవర్గం అభివృద్దే ధ్యేయంగా జగన్‌ పాలన

డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడిచి సొంత సామాజిక వర్గం అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్‌ పాలన సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Updated : 07 Dec 2022 06:21 IST

అంబేడ్కర్‌ వర్ధంతిలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు-అమరావతి: డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడిచి సొంత సామాజిక వర్గం అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్‌ పాలన సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి అచ్చెన్నాయుడితో పాటు తెదేపా సీనియర్‌ నాయకులు అయ్యన్నపాత్రుడు, కళా వెంకటరావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, డి.రామారావు, ఎ.సత్యప్రసాద్‌, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...‘రాష్ట్రంలో రౌడీయిజం, అరాచకం రాజ్యమేలుతోంది. అంబేడ్కర్‌ దేశానికి రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన ప్రాథమిక హక్కులను జగన్‌రెడ్డి కాలరాస్తున్నారు. ప్రజలు తమ భావాలను బహిరంగంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశంపై వైకాపా రౌడీలు, గూండాలు దాడులు చేస్తుంటే వాటిని సీఎం జగన్‌ ప్రోత్సహిస్తున్నారు...’ అని మండిపడ్డారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని