పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాల్సిందే!

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించేవరకు ఉద్యమించాలని భాజపా నిర్ణయించింది. సోమవారం నుంచి డిసెంబరు 7 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రధాని

Published : 29 Nov 2021 03:42 IST

నేడు, రేపు ఎద్దుల బండ్లపై ప్రదర్శనలు
డిసెంబరు 7 వరకు కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించేవరకు ఉద్యమించాలని భాజపా నిర్ణయించింది. సోమవారం నుంచి డిసెంబరు 7 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు 23 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాయని, కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని  విమర్శించారు. దీన్ని నిరసిస్తూ సోమ, మంగళ వారాల్లో  మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై నిరసనలు, డిసెంబరు 1న బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు, నల్లబ్యాడ్డీలతో ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు,  3న ఎస్సీ మోర్చా, 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు ఉంటాయన్నారు. 5న ఎస్టీ మోర్చా, 6న కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్‌యార్డుల వద్ద నిరసన, 7న మైనార్టీ మోర్చా కార్యకర్తల ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, జిల్లా నేతలతో సంజయ్‌ ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించింది. తెరాస ప్రభుత్వం గతేడాది మే నుంచి ఈ ఏడాది నవంబరు వరకు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8.83, డీజిల్‌పై రూ.5.68 వ్యాట్‌ విధించింది. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది’ అని సంజయ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని