CM KCR: యూపీలో కేసీఆర్‌ ప్రచారంపై త్వరలో నిర్ణయం

హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కొద్దిసేపు అయిదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించారు. కేంద్రంలో భాజపా రైతు, ప్రజావ్యతిరేక పాలన

Updated : 18 Jan 2022 07:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కొద్దిసేపు అయిదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించారు. కేంద్రంలో భాజపా రైతు, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ విమర్శించినట్లు తెలిసింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ ఖాయమని పేర్కొన్నట్లు సమాచారం. యూపీలో ఎన్నికల ప్రచారం ఇతర అంశాలపై సీఎం మాట్లాడారు. దీనిపై త్వరలోనే పార్టీ సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రిమండలి సమావేశం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 వరకు తొమ్మిది గంటల పాటు సాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని