చక్కెర పరిశ్రమలను నాకు అప్పగించండి నడిపిస్తా

నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ముత్యంపేట, బోధన్‌ చక్కెర పరిశ్రమలను రూ.200- 300 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేట చక్కెర పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.

Updated : 19 Jan 2022 03:28 IST

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ సంసిద్ధత

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ముత్యంపేట, బోధన్‌ చక్కెర పరిశ్రమలను రూ.200- 300 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేట చక్కెర పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను అప్పగిస్తే చక్కెరతో పాటు ఇథనాల్‌, లిక్కర్‌ లాంటివి తయారు చేసి ఈ ప్రాంత రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూపిస్తానన్నారు. ‘నిజామాబాద్‌లో పసుపు రైతుల కోసం స్పైస్‌ బోర్డును ఏర్పాటు చేశాం. కేంద్రం నుంచి రూ.30 కోట్ల బడ్జెట్ కేటాయించాం. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో చక్కెర పరిశ్రమలతో పాటు పసుపు, వరి పంటలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు పిలిచినా వస్తాన’ని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. సీఎంకు వీలుకాకపోతే మంత్రి కేటీఆర్‌తో చర్చించి రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎంపీ పర్యటన సందర్భంగా కొన్ని గ్రామాల్లో తెరాస నేతలు నిరసనలకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని