Exit polls: పార్టీ శ్రేణులకు స్టాలిన్‌ విజ్ఞప్తి  

తమిళనాడు పీఠం డీఎంకే కూటమిదేనంటూ పలు ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనాలపై ఆ పార్టీ చీఫ్‌ స్టాలిన్‌ స్పందించారు. అధిక సీట్లతో......

Published : 01 May 2021 01:08 IST

చెన్నై: తమిళనాడు పీఠం డీఎంకే కూటమిదేనంటూ పలు ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనాలపై ఆ పార్టీ చీఫ్‌ స్టాలిన్‌ స్పందించారు. అధిక సీట్లతో డీఎంకే గెలుస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎంతో సంతోషాన్నిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కరోనా ఉద్ధృతి దృష్ట్యా  మే 2న లెక్కింపు కేంద్రాల వద్ద పార్టీ కార్యకర్తలు గుంపులుగా గుమిగూడొద్దని కోరారు. విజయోత్సవ వేడుకలను ఎవరి ఇంట్లో వారే చేసుకోవాలని రాజకీయ పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కొవిడ్‌ గుప్పిట్లో చిక్కుకుందని, అనేకమంది ప్రజలు ఆక్సిజన్‌, పడకలు లేక అవస్థలు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 

కరోనాతో రాష్ట్రం విలవిల్లాడుతున్న సందర్భంలో ప్రజలు గుమిగూడొద్దని కోరారు. పార్టీ కార్యకర్తల జీవితాలు తమకెంతో ముఖ్యమన్నారు. కరోనా వేళ వీధులను ఎడారిలా ఉంచుదాం.. గుండెల్లో సంతోషాన్ని నింపుకొందాం అని పిలుపునిచ్చారు. తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగ్గా మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 160కి పైగా స్థానాల్లో డీఎంకే కూటమి విజయం సాధిస్తుందంటూ దాదాపు అన్ని సర్వేలూ చెబుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని