Nadendla Manohar: వైకాపా ప్రభుత్వం చేతగానితనం వల్లే బ్యాంకులు బ్లాక్‌ లిస్టులో పెట్టాయి: నాదెండ్ల

వైకాపా ప్రభుత్వం చేతగానితనం వల్లే జాతీయ బ్యాంకులు బ్లాక్ లిస్టులో చేర్చాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

Published : 15 Dec 2023 15:15 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వం చేతగానితనం వల్లే జాతీయ బ్యాంకులు బ్లాక్ లిస్టులో చేర్చాయని జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పేరుతో న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదన్నారు. ఆ డబ్బులను దుర్వినియోగం చేసినందునే బ్యాంకులు బ్లాక్ లిస్టులో పెట్టాయని మనోహర్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.

ఈ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా.. ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువును తీసేశారని మనోహర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోకులు వేసుకునేలా చేశారన్నారు. నిధుల దుర్వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని