KCR: భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక

భారాస (BRS) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)ను ఎన్నుకున్నారు.

Updated : 09 Dec 2023 11:00 IST

హైదరాబాద్‌: భారాస (BRS) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)ను ఎన్నుకున్నారు. కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ భవన్‌లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకొని భారాస ప్రతిపక్ష హోదాలో నిలిచిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా శనివారం నాటి సమావేశానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నందున బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీకి కేటీఆర్‌ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠా గోపాల్‌ కూడా సమావేశానికి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని