
China incursions: భాజపా.. బీజింగ్ జనతా పార్టీలా మారింది: ఖర్గే
దిల్లీ: భారత్‌లోకి చైనా చొరబాట్ల అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేస్తున్నారంటూ మండిపడ్డారు. భాజపా ‘బీజింగ్ జనతా పార్టీ’గా రూపాంతరం చెందిందంటూ ట్విటర్లో ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో గ్రామాల్ని నిర్మించేందుకు అక్కడి భాజపా ప్రభుత్వం చైనాను అనుమతించిందని, అలాగే, బీజింగ్ విమానాశ్రయ చిత్రాలను యూపీలో నిర్మించనున్న కొత్త విమానాశ్రయంగా భాజపా ప్రభుత్వం చూపిస్తోందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. లద్దాఖ్‌లో మన భూభాగాన్ని చైనాకు అప్పగించేసిన భాజపా.. బీజింగ్ జనతా పార్టీగా మారిందని ఆరోపించారు. లద్దాఖ్, ఉత్తరాఖండ్‌తో పాటు తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబాట్లపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. డ్రాగన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకొని తిరిగి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
► Read latest Political News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.