Mallu Ravi: కాంగ్రెస్‌ పాలన చూసి ప్రజలు సంతోషిస్తున్నారు: మల్లు రవి

అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్‌ (KTR), హరీశ్‌ రావు (Harishrao)ల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే విధంగా ఉందని కాంగ్రెస్‌ నేత మల్లు రవి మండిపడ్డారు.

Published : 17 Dec 2023 20:02 IST

హైదరాబాద్‌: అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్‌ (KTR), హరీశ్‌ రావు (Harishrao)ల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే విధంగా ఉందని కాంగ్రెస్‌ నేత మల్లు రవి (Mallu Ravi) మండిపడ్డారు. సమావేశాల మొదటిరోజునే ప్రతిపక్ష నాయకులు ఎదురుదాడికి దిగడం.. పిల్లి శాపాలు పెట్టడం చూస్తుంటే అధికారం కోల్పోయి ఎంత బాధలో ఉన్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిన విషయాలను భారాస నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామన్న ఆయన.. సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం అనేక సమస్యలపై సమీక్షలు చేసి పరిష్కారాలు చూపుతున్నారని వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే.. భారాస నాయకులు భరించలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పదిరోజుల పాలన చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారని మల్లు రవి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని