Ambati: పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో ఇప్పుడే చెప్పలేం: అంబటి

పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో ఇప్పుడే చెప్పలేమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వ్యాఖ్యానించారు.

Updated : 29 Jul 2023 15:52 IST

విజయవాడ: పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో ఇప్పుడే చెప్పలేమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని మాత్రం చెప్పగలమన్నారు. 

‘‘విభజన చట్టంలో పోలవరాన్ని తామే కడతామని కేంద్ర ప్రభుత్వం చెబితే.. ఎందుకు మేమే కడతామని తీసుకున్నారు? 2019 నాటికి పోలవరం 48.39 శాతం మాత్రమే పూర్తైంది. నాకు ప్రాజెక్టుల గురించి తెలియదు కానీ, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. 41.15 శాతం అనేది ప్రాజెక్టులో మొదటి దశ, మిగితాది తదుపరి దశ. ప్రస్తుతం మొదటి దశకు మాత్రమే కేంద్రం నిధులు మంజూరు చేసింది. అర్ అండ్ అర్, భూ సేకరణ అంతా కేంద్రం భరించాల్సిందే. ప్రాజెక్టులో క్రిటికల్ పనులన్నీ వైకాపా ప్రభుత్వం చేసినవే. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ స్థానంలో కొత్తది కట్టాల్సిందే’’ అని అంబటి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు