Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Published : 19 Dec 2023 16:57 IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. పార్లమెంట్‌లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా ఎంపీ సిఫార్సు వల్లే నిందితులకు పాస్‌లు వచ్చాయని, వారిని కాపాడేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌ భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్నారు. 

‘‘ప్రభుత్వం మారిందని భారాస నేతలు గ్రహించాలి. గతంలో బంగారు పాలన అందించామని భారాస నేతలు అంటున్నారు. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ కచ్చితంగా నెరవేస్తుంది. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు’’ అని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని