Raja Singh: ఆ వాహనాన్ని వాడలేను.. మీరే తీసుకోండి: ఇంటెలిజెన్స్‌ ఐజీకి రాజాసింగ్‌ లేఖ

ఇంటెలిజెన్స్‌ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు.

Updated : 22 Nov 2022 16:28 IST

హైదరాబాద్‌: ఇంటెలిజెన్స్‌ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు.

‘‘నాకు కేటాయించిన వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ పలుమార్లు పోలీసు శాఖ దృష్టికి తీసుకొచ్చినా తిరిగి అదే వాహనాన్ని కేటాయిస్తున్నారు. 2010 మోడల్కు చెందిన వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్గంమధ్యలోనే నిలిచిపోతోంది.

ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు. ఆ జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. తీవ్రవాదుల నుంచి నాకు ప్రాణహాని ఉన్న విషయం పోలీసులకు తెలుసు. అయినా నా భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారు. దీని వల్ల ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు నాపై దాడి చేసేలా అవకాశం కల్పిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. నాకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోండి. పాత వాహనాన్ని నేను వినియోగించలేను’’ అని రాజాసింగ్‌ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని