Nadendla Manohar: వైకాపా విముక్త ఏపీ కోసం అంతా ఏకం కావాలి: నాదెండ్ల
వైకాపా విముక్త ఏపీ కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే జనసేన ఆలోచన చేస్తుందని వెల్లడించారు.
తిరుపతి: వైకాపా విముక్త ఏపీ కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే జనసేన ఆలోచన చేస్తుందని వెల్లడించారు. కడప జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనోహర్‌కు జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ నిర్ణయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, భేటీపై వస్తున్న రూమర్స్ అర్థరహితమన్నారు. ప్రధానితో జరిగిన సమావేశాన్ని గౌరవిస్తామన్నారు.
కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడాది అవుతున్నా నష్టపోయిన గ్రామాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఘోరంపై 10 రోజుల తర్వాత ఆయన స్పందించారని గుర్తుచేశారు. 3 నెలల్లో ఇంటి తాళాలు ఇస్తామన్న సీఎం హామీ నెరవేరలేదని, ఎకరాకు రూ.12,500 ఇస్తామని చెప్పి చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నివేదిక ఇస్తామన్నారు. పెడన పోలీస్ స్టేషన్ ఆవరణలో జనసేన కార్యకర్తలపై దాడి అమానుషమని, ప్రభుత్వ దాడులకు జనసైనికులు భయపడరన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!