Nadendla Manohar: ఏపీకి జగన్ అవసరం లేదు: తెనాలిలో నాదెండ్ల మనోహర్

ఎందుకు ఏపీకి జగన్ అవసరం లేదో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Updated : 30 Sep 2023 18:29 IST

తెనాలి: ‘వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్’ ( Why ap does not need YS jagan) అనేది జనసేన నినాదమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఎందుకు ఏపీకి జగన్ అవసరం లేదో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తామని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నాయకులు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి సిద్ధం అయ్యారని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు గడపగడపకు ప్రభుత్వం.. జగనన్నకు చెబుదాం... జగనన్నే మా నమ్మకం అంటూ రకరకాల కార్యక్రమాలు చేసి విఫలమైన వైకాపా నాయకులు.. ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రజలకు మరోసారి టోపీ పెట్టడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.

రాజధాని లేకుండా చేసిన వ్యక్తి.. వద్దే వద్దు..

‘‘సంపద సృష్టి అనే విషయాన్ని పక్కన పెట్టి అప్పులతో రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశారు. బటన్లు నొక్కుతూ కాలం గడుపుతున్న జగన్ ఈ రాష్ట్రానికి వద్దు. వచ్చిన ఆదాయం అంతా అప్పులు, వాటి వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. రెవెన్యూ లోటు దారుణంగా పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రం మీద రూ.9.61 లక్షల కోట్ల అప్పు ఉంది. గత నాలుగున్నర ఏళ్లలో రూ.2.61 లక్షల కోట్లను సంక్షేమ పథకాలకు వినియోగించారని సీఎం చెబుతున్నారు. మరి అప్పులు చేసిన మిగిలిన డబ్బు ఏమైపోయింది? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, సంక్షేమం ముసుగు వేసిన ఈ సీఎం మళ్లీ వద్దే వద్దు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపి తర్వాత రాజధానే లేకుండా చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం లేనే లేదు’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు