BJP: భాజపా కీలక కమిటీ నుంచి గడ్కరి, చౌహాన్‌ ఔట్‌

భారతీయ జనతా పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు పునర్‌ వ్యవస్థీకరించారు.

Updated : 30 Aug 2022 14:58 IST

ఫడణవీస్‌కు చోటు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ జనతా పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్‌ వ్యవస్థీకరించారు. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని బోర్డు నుంచి తొలగించారు. కొత్తగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్‌, కె.లక్ష్మణ్‌లను తీసుకొన్నారు. ఈ బోర్డులో జేపీ నడ్డా (అధ్యక్షుడు), నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా,  బీఎస్‌ యడియూరప్ప,  సర్బానంద సోనోవాల్‌ , కె.లక్ష్మణ్‌, ఇక్బాల్‌ సింగ్‌ లాల్‌ పురా, సుధా యాదవ్‌, సత్యనారాయణ జటియా, బి.ఎల్‌. సంతోష్‌ ఉన్నారు. 

ఇక భాజపా సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో కూడా మార్పులు చేశారు. దీనిలో కొత్తగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు స్థానం కల్పించారు. భాజపా కొత్త సీఈసీలో జేపీ నడ్డా (అధ్యక్షుడు), నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద్‌ సోనోవాల్‌, కె.లక్ష్మణ్‌, ఇక్బాల్‌ సింగ్‌ లాల్‌పురా, సుధా యాదవ్‌, సత్యనారాయణ జటియా, భూపేంద్ర యాదవ్‌, దేవేంద్ర ఫడణవీస్‌, ఓం మాథూర్‌, బీఎల్‌ సంతోష్‌, వనతి శ్రీనివాస్‌ ఉన్నారు.

ఈ రెండు కమిటీల్లో మోదీ సర్కారులో అత్యంత సీనియర్‌ మంత్రి గడ్కరీకి స్థానం దక్కకపోవడం గమనార్హం. మరోపక్క పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో  స్థానం దక్కించుకోవడం విశేషం. కర్ణాటకలో ఆయనకు ఉన్న పట్టు కారణంగా పార్టీలో కేంద్ర కమిటీల్లో స్థానం దక్కించుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు