Maharashtra: మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై వీడిన అనిశ్చితి.. 48 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎన్నంటే..?

అసంతృప్తులు, విమర్శల మధ్య ఎట్టకేలకు మహారాష్ట్ర (Maharashtra)లో విపక్ష పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది.  

Published : 09 Apr 2024 13:35 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికల వేళ.. మహారాష్ట్ర (Maharashtra)లో విపక్ష పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. దాంతో గత కొద్దికాలంగా లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై జరుగుతోన్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు మహా వికాస్ అఘాడీ (MVA) భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, శరద్‌ పవార్‌ ఎన్‌సీపీ వర్గం, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన సంయుక్తంగా ప్రకటన చేశాయి. 

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలో ఉద్ధవ్‌ వర్గం అత్యధికంగా 21 చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు 17, శరద్‌పవార్‌ ఎన్‌సీపీకి 10 సీట్లు దక్కాయి. పవార్‌, ఠాక్రే, కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్ నానా పటోలే ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ‘‘ఒక్క సీటు కోసం పలువురు పోటీ పడుతుంటారు. అందులో తప్పులేదు. కానీ, గెలిచేవారికే ప్రాధాన్యం ఉంటుంది’’ అని ఉద్ధవ్‌ అన్నారు. ఇదిలా ఉంటే..రాష్ట్రంలో ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది.

ఈ సీట్ల సర్దుబాటు వేళ.. కాంగ్రెస్, ఠాక్రే వర్గం మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కిచిడీ కుంభకోణంలో శివసేన (యూబీటీ) నేత, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి అమోల్‌ కీర్తికర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. అమోల్‌కు టికెట్ ఇవ్వడాన్ని సంజయ్ నిరుపమ్ తప్పుపట్టారు. ఈ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంజయ్‌పై ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని