Pawan Kalyan: ఉపాధి కోసం వచ్చి మృతిచెందడం దురదృష్టకరం: పవన్‌కల్యాణ్‌

సికింద్రాబాద్‌ బోయగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 23 Mar 2022 11:52 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బోయగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో 11 మంది వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమని.. వారి మృతి తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఉపాధి కోసం బిహార్‌ నుంచి వలస వచ్చిన కూలీలు మృతిచెందడం దురదృష్టకరమన్నారు. 

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: బండి సంజయ్‌

బోయగూడ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడం తనను కలచివేసిందని భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పొట్టకూటి కోసం బిహార్‌ నుంచి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అనుమతుల నుంచి సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం.. పర్యవేక్షణాలోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని