Pawan kalyan: ‘వారాహి’ రంగు వివాదం.. నిబంధనలన్నీ నా కోసమేనా?: పవన్
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైకాపా నేతలు చేసిన విమర్శలపై పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా స్పందించారు.
అమరావతి: జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైకాపా నేతలు చేసిన విమర్శలపై పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా మరోసారి స్పందించారు. నిబంధనలు ఒక్క పవన్‌కల్యాణ్ కోసమేనా? అని ప్రశ్నించారు. ‘వారాహి’ వాహనం మాదిరిగా ఆలీవ్ గ్రీన్ కలర్‌లో ఉన్న వాహనాల ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘అసూయతో వైకాపా ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి. వైకాపా టికెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో లంచాలు, వాటాల వేధింపుల వల్ల ‘కారు నుంచి కట్ డ్రాయర్ కంపెనీల’ దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయి’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘వారాహితో యుద్ధానికి సిద్ధం అంటూ పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన వాహనానికి నిషేధిత రంగు వేశారు’ అని పేర్ని నాని ఆరోపించారు. గురువారం ఆయన ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోంది. అదే రంగు ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వదు. మీరు ఎటూ రంగు మార్చాలి కదా... అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుంది. మీరు తెదేపాతో కలిసి వెళ్లేవారే కదా? ఇప్పుడేదో ప్రధాని మోదీ చెప్పడంతో నాలుగు రోజులు ఆగారు కదా. వ్యాన్లతో ఎన్నికల యుద్ధం అయిపోతుందనుకుంటే ప్రతి ఒక్కరూ వాటినే కొనేస్తారు. నేనూ కొనలేనా? ఇలాంటివి సినిమాల్లో అయితే బాగుంటాయి’ అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్ స్పందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ladakh: తూర్పు లద్దాఖ్ వద్ద వ్యూహాత్మక రహదారి నిర్మాణం ప్రారంభం
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
-
Sports News
IND Vs NZ : రెండో టీ20లో ఉమ్రాన్ స్థానంలో అతడిని తీసుకోవాలి : మాజీ క్రికెటర్
-
India News
S Jaishankar: ‘అది 1962లోనే జరిగింది..’ రాహుల్‌కు జైశంకర్ కౌంటర్
-
India News
రూ.1.5 కోట్లకు అడిగినా.. ఆ దున్నను అమ్మేది లేదట
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు