Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్‌ కల్యాణ్‌

పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 19 Mar 2024 19:34 IST

మంగళగిరి: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు.. పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నా గెలుపు కోసం మాత్రమే పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదు. గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం కూడా నాకు ముఖ్యమే. ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయి. నన్ను అసెంబ్లీకి పంపిస్తామనే హామీ చాలా మంది ఇచ్చారు. ఇకపై పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటా. ఇక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తా.

లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తా..

పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం చేద్దాం. ఒక ఎమ్మెల్యే తలచుకుంటే ఎంత అభివృద్ధి చేయొచ్చో అంత చేసి చూపిస్తా. నియోజకవర్గంలో విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు పెంచుతాం. పిఠాపురంలో రైతును కన్నీరు పెట్టనివ్వను. కేంద్ర నాయకత్వం నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడిగింది. కానీ, ఎమ్మెల్యేగా పోటి చేయడమే నాకిష్టం. తొలుత రాష్ట్రం కోసం పనిచేసి తర్వాత దేశం కోసం చేద్దాం. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైకాపాను వీడి జనసేనలోకి రావాలి. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి నన్ను ఓడించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తా. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని