Mallikarjun Kharge: ఆ చారిత్రక వైఫల్యాన్ని ప్రధాని ఇంకా గుర్తించలేదు: ఖర్గే

ఆర్థిక పతనానికి కారణమైన నోట్ల రద్దులోని చారిత్రక వైఫల్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా గుర్తించలేదని భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు.

Published : 07 Nov 2022 17:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక పతనానికి కారణమైన నోట్ల రద్దులోని చారిత్రక వైఫల్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా గుర్తించలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. భారత్‌లో పెద్ద నోట్లను రద్దు చేసి రేపటికి ఆరు ఏళ్లు. ఈ నేపథ్యంలో ఖర్గే మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రజల వద్ద ఉన్న నోట్ల విలువ రూ.30.88 లక్షల కోట్లకు చేరిందన్నారు. ‘‘దేశాన్ని నల్లధనం నుంచి విముక్తి చేయడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుందని వాగ్దానం చేశారు. కానీ, వ్యాపారాలు నాశనమై.. ఉద్యోగాలు పోయాయి. ఆ మాస్టర్‌ స్ట్రోక్‌కు ఆరేళ్లయ్యాక ఇప్పుడు.. 2016లో కంటే ప్రజల వద్ద 72శాతం అధికంగా నగదు ఉంది’’ అని ఖర్గే వివరించారు.

తాజాగా రిజర్వుబ్యాంక్‌ లెక్కల ప్రకారం ప్రజల వద్ద రూ.30.88 లక్షల కోట్లు నగదు ఉంది. 2016 నవంబర్‌ 4వ తేదీ నాటి బ్యాంక్‌ డేటా ప్రకారం అప్పట్లో ప్రజల వద్ద రూ.17.7 లక్షల కోట్ల నగదు ఉంది. ప్రజల వద్ద ఉన్న నోట్లు, చిల్లర నాణేలను నగదుగా లెక్కలోకి తీసుకొంటారు. ప్రతి 15 రోజులకోసారి ఆర్‌బీఐ చలామణిలో ఉన్న నగదు వివరాలను అందిస్తుంటుంది. బ్యాంకుల్లో ఉన్న నగదును మినహాయించిన తర్వాతే చలామణిలో ఉన్న నగదును వెల్లడిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని