Ponguleti Srinivas Reddy: అధికారం పోగానే కేసీఆర్‌కు రైతులు గుర్తొచ్చారు: మంత్రి పొంగులేటి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు..

Updated : 05 Apr 2024 23:32 IST

హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కరీంనగర్‌ వెళ్లిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే బాగుండేదన్నారు. అధికారం పోగానే కేసీఆర్‌కు రైతులు, నీతులు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ గతం, వర్తమానం అంతా నటన అని వ్యాఖ్యానించారు.

‘‘అధికారంలో ఉన్నప్పుడు గర్వంతో తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. అధికారం పోగానే ప్రజలు గుర్తుకువచ్చారు. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వం మీదకు నెడుతున్నారు. భారాస ఉనికిని కాపాడుకునేందుకే రైతులను వాడుకుంటున్నారు. కేసీఆర్‌ గత పదేళ్లలో ఎనాడైనా పంటలు పరిశీలించారా? ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే పరిహారం ఇచ్చారా? భారాస ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే రాష్ట్రంలో కరవు ఏర్పడింది’’ అని మంత్రి ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని