BJP: పొత్తులపై అభిప్రాయం చెప్పాం.. అధిష్ఠానానిదే నిర్ణయం: పురందేశ్వరి

ఏపీలో పొత్తులపై భాజపా అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు.

Published : 17 Feb 2024 22:30 IST

దిల్లీ: ఏపీలో పొత్తులపై భాజపా అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. దిల్లీలో జరిగిన భాజపా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పొత్తులపై ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయాలను అధిష్ఠానం తీసుకుందని తెలిపారు. ఏపీలో దొంగ ఓట్లు, ప్రజాసమస్యలపై భాజపా పోరాడుతుందన్నారు. పొత్తుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యత అని వివరించారు. భాజపా తరఫున పోటీ చేసేందుకు చాలా దరఖాస్తులు వచ్చాయని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థుల విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని