Ravela Kishore Babu: భాజపాకు రావెల కిశోర్‌బాబు రాజీనామా

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు భాజపాకు రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఈ మేరకు రావెల లేఖ పంపించారు.

Updated : 16 May 2022 14:09 IST

అమరావతి: మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు భాజపాకు రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఈ మేరకు లేఖ పంపించారు. ప్రధాని మోదీ అవినీతిరహిత, సుస్థిరమైన, సమర్థవంతమైన పాలనా విధానాలు నచ్చడంతో భాజపాలో చేరినట్లు వివరించారు. మోదీ మీద ఉన్న గౌరవం తనను మరింత భాజపా వైపు ఆకర్షింపజేశాయని లేఖలో చెప్పారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు సోము వీర్రాజుకు రాసిన లేఖలో రావెల వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని