సీఎం విధానం మారాలి: రఘురామకృష్ణరాజు

మాతృభాషలో విద్యాబోధన ఎంతో అవసరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Updated : 30 Jul 2020 14:01 IST

దిల్లీ: మాతృభాషలో విద్యాబోధన ఎంతో అవసరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మన భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు.   మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని ఎవరైనా సూచిస్తే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని సీఎం జగన్‌ ఎదురు ప్రశ్నలు వేయడం సరి కాదన్నారు. ఎల్లాప్రగడ, సీవీ రామన్‌ మాతృభాషలోనే చదువుకున్నారని గుర్తు చేశారు. 

‘‘ప్రపంచమంతా ఒక దారి, నాదో దారి అని సీఎం అనుకోవద్దు. చిన్న రాష్ట్రాలు కూడా మాతృభాషకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికైనా జగన్‌ ..ఆంగ్ల మాధ్యమం ప్రతిపాదనను ఉప సంహరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని  ’’ అని రఘురామకృష్ణరాజు కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని