Andhra News: మోదీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పేదల నడ్డి విరుస్తోంది: సీతారాం ఏచూరి

కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని సీపీఎం జాతీయ కార్యదర్శి

Published : 25 Sep 2022 01:29 IST

అమరావతి: కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వం పేదల నడ్డి  విరుస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విజయవాడలో శనివారం జరిగిన ‘దేశ రక్షణ భేరి’ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 15 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దేశంలో అందరికీ ఉపాధి కల్పించవచ్చన్నారు.

‘‘దేశంలో 20-25 ఏళ్ల యువకుల్లో ప్రస్తుతం 42శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. వారికే ఉద్యోగాలు దొరకట్లేదు. కానీ, దాదాపు 10లక్షల కంటే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. ప్రపంచ కుబేరుల్లో ఒక్కడిగా ఉన్న గౌతమ్‌ అదానీ ఒకప్పుడు 330వ స్థానంలో ఉండేవారు. కానీ, మోదీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలోనే రెండో స్థానానికి చేరారు’’ అని ఏచూరి విమర్శలు గుప్పించారు. దేశానికి మోదీ సర్కార్‌ అన్యాయం చేస్తుంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రానికి సీఎం జగన్‌ అండగా నిలుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని