Amalapuram: మరో యుద్ధాన్ని తలపించేలా అమలాపురం ఘటన: సోము వీర్రాజు

కోనసీమలో జరిగిన ఘటనకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అమలాపురంలో మంగళవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు మరో యుద్ధాన్ని తలపించాయని తెలిపారు.

Published : 26 May 2022 01:11 IST

అమరావతి: కోనసీమలో జరిగిన ఘటనకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అమలాపురంలో మంగళవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు మరో యుద్ధాన్ని తలపించాయని తెలిపారు. ఆ యుద్ధం జరగడానికి ఏపీ సీఎం జగన్‌ వైఖరే కారణమని ఆరోపించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం తప్పన్నారు. వెంటనే ఎమ్మెల్సీ ఆనంతబాబును పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారణ చేయాలని సోము డిమాండ్ చేశారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం కోనసీమలో ఒక చిచ్చును పెట్టింది. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అమలాపురం ఘర్షణలో భాజపా శ్రేణులు పాల్గొనడం గానీ, మద్దతు ఇవ్వడం గానీ చేయలేదు. నెల రోజులు గడిచిన తర్వాత అంబేడ్కర్ పెరు పెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొదట అంబేడ్కర్ జిల్లా అని పెట్టి ఉంటే ఈస్థాయి ఉద్రిక్తత చోటుచేసుకునేది కాదు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు సంయమనం పాటించాలి. కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో రాజకీయ పార్టీలు అంగీకరించినట్టు అధికారికంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చారా’’ అని ప్రభుత్వాన్ని సోము ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని