Andhra News: కార్పొరేట్‌ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు

షెడ్యూల్డు కులాల వారిని వైకాపా ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని, వారి సమస్యల పరిష్కారంకోసం ఏప్రిల్‌లో విజయవాడలో భారీ బహిరంగ నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకిటించారు.

Published : 29 Jan 2023 01:13 IST

విజయవాడ: వైకాపా ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసి.. అభివృద్ధిని విస్మరించి ఓ కార్పొరేట్‌ కంపెనీ తరహాలో వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. షెడ్యూల్డ్‌ కులాల వారిని రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని, వారి సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్‌లో విజయవాడలో భారీ బహిరంగ నిర్వహిస్తామని ప్రకిటించారు. విజయవాడ భాజపా కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ  ప్రధాన కార్యదర్శి శంభునాథ్‌ తొండియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కోసం భాజపా 48గంటల దీక్ష చేపట్టిందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ భాజపా అని , జగన్‌ ప్రభుత్వంపై గట్టిగా గళమెత్తే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తూ ట్రేడింగ్ కంపెనీ మాదిరి ప్రభుత్వం తయారైందని దుయ్యబట్టారు. 2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ భాజపాయేనని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, అంబేడ్కర్‌ ఆలోచనతో భాజపా పనిచేస్తోందని గుజరాత్‌ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ తొండియా తెలిపారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని