Andhra News: ఆ కుర్చీకున్న విలువేంటో ఆమెకు తెలుసా?: బొండా ఉమా

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచార ఘటనలో న్యాయం కోరితే తమకే నోటీసులిస్తారా అని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు.

Updated : 23 Apr 2022 12:41 IST

విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచార ఘటనలో న్యాయం కోరితే తమకే నోటీసులిస్తారా అని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చున్న కుర్చీ విలువ ఏంటో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కు తెలుసా అని నిలదీశారు. విజయవాడలో బొండా ఉమా మీడియాతో మాట్లాడారు.

‘‘రాజ్యాంగ సంస్థను స్వార్థ ప్రయోజనాల కోసం వాడతారా? పదవి ఇచ్చినందుకు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తారా? నోటీసులో రాసిన తేదీల్లో తప్పులు ఉన్నాయి. స్పృహలో ఉండే నోటీసులు తయారు చేశారా అనిపిస్తోంది. మహిళల రక్షణ వదిలేసి తాడేపల్లి విధేయత చాటుకోవడమే పనా? ఘటన జరిగి మూడు రోజులైనా స్పందించేందుకు ప్రభుత్వానికి తీరిక లేదా? చంద్రబాబు వస్తున్నారని తెలిసే ప్రభుత్వం నిద్ర లేచింది. మేము వస్తున్నప్పుడే వాసిరెడ్డి పద్శ వచ్చారు. తాడేపల్లి ఆదేశాలతో ఆమె మాకు సమన్లు జారీ చేస్తారా?’’ అని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ తెదేపా అధినేత చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని