Atchannaidu: ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత ఎప్పుడైనా చూశామా?: అచ్చెన్న

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైకాపాపై విముఖత పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Updated : 26 Oct 2023 13:15 IST

మంగళగిరి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైకాపాపై విముఖత పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా  ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్‌ రెడ్డి’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. వైకాపా సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై ఎస్సీల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనకు వైకాపా సమాధానం చెప్పేలా.. బస్సు యాత్రకు వచ్చే వైకాపా నేతలపై ఒత్తిడి తేవాలని నేతలు స్పష్టం చేశారు. నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైకాపాకు గుర్తు చేయాలన్నారు. రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైకాపా బస్సు యాత్ర చేయాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు. ‘‘ ఎస్టీలవి 29 పథకాలు, మైనారిటీలవి 11 పథకాలు రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత ఎప్పుడైనా చూశామా? ఇన్ని అక్రమాలు ఎప్పుడైనా చూశామా? ఇన్ని అరాచకాలపై జగన్‌ను ప్రశ్నించే ధైర్యం ఏ మంత్రికైనా ఉందా?’’ అని అచ్చెన్న నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని