Eatala Rajendar: కేసీఆర్‌ ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు: ఈటల

ప్రజలపై ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల కోసమే ‘దళితబంధు’ కార్యక్రమాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు...

Updated : 12 Oct 2022 15:40 IST

జమ్మికుంట: ప్రజలపై ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల కోసమే ‘దళితబంధు’ కార్యక్రమాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. తన రాజీనామాతోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డులు వస్తున్నాయన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. హుజూరాబాద్‌ ప్రజలకు ఇచ్చే వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వం ఇచ్చే దళితబంధు, పింఛను, రేషన్‌కార్డులు తీసుకుని ఓటు మాత్రం ఈటలకే వేస్తామని హుజూరాబాద్‌ ప్రజలు అంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోందన్నారు. నియోజకవర్గంలో రూ.వందలకోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా తెరాస ఓటమి నిర్ణయమైపోయిందన్నారు.  సీఎం కేసీఆర్‌ ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే దళితబంధు పెట్టారని ప్రజలకూ తెలుసన్నారు. తన డిమాండ్ల ఫలితంగానే దళిత అధికారులకు మంచి పోస్టింగులు ఇచ్చారని.. రాజీనామాతో హుజూరాబాద్‌ ప్రజలకు లాభం కలిగిందని ఈటల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని